'స్టాలిన్'నవుతా: చిరు

అలాగే రూ.100కే నిత్యావసర సరుకులు ఇస్తామని, కేజీ నుంచి పీజీదాకా ఉచిత విద్యను అందిస్తామని, అగ్రవర్ణాల పేదల విద్యకు ప్రాధాన్యం ఇస్తామని, విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సాయం అందినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, ఒకటి రెండు పథకాలు బాగుంటే సరిపోదని, బాగోలేని వాటి బాగోతాలు ఎవరికి తెలియవని చిరంజీవి ఎద్దేవా చేశారు. పేదలను కలిసినప్పుడు అనేక సమస్యలను ఏకరువు పెడుతున్నారని, ప్రభుత్వం సరిగా పనిచేస్తే సమస్యలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications