2 నెలలు జీతాల్లేవు: సత్యం ఈమెయిల్

హైదరాబాద్: రెండు నెలల పాటు జీతాలు ఇవ్వలేమని సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం తన 53 వేల మంది సిబ్బందికి ఈ-మెయిల్ పంపింది. ఇప్పటికే భయభ్రాంతులైన సిబ్బందికి ఇది అశనిపాతంలా తగిలింది. పదివేల మందిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయించినా, ఈ రెండు నెలల జీతం కట్ దెబ్బకు చాలామంది సంస్ధను స్వచ్చందంగా వీడిపోయే అవకాశముంది.

మాదాపూర్ లోని సత్యం కార్యాలయంలో సెబి అధికారులు రామలింగరాజు తరఫు న్యాయవాది భరత్ కుమార్ ను విచారిస్తున్నారు. తన ఆరోగ్యం బాగుండలేదని రాజు చెప్పడం వల్ల ఈ న్యాయవాది రంగంలోకి వచ్చారు. రామలింగరాజు ఎక్కడ ఉన్నదీ చెప్పడానికి ఆయన న్యాయవాది మీడియా ముందు నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+