రాజుకు సెబీ సమన్లు, ఇంట్లో సోదా
హైదరాబాద్: సత్యం రామలింగరాజు ఇంట్లో సెబి అధికారులు సోదాలు నిర్వహించారు. అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో సత్యం కార్యాలయాల మీద కూడా వారు దాడులు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునే అవకాశముంది.
కాగా సత్యం సిఎఫ్ వో శ్రీనివాస్ వడ్లమానిని, రామలింగరాజు సోదరుడు రామరాజును పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది. ఈ సంఘటనలు సత్యం ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొత్తం 53 వేల మంది ఉద్యోగులు ఉండగా అందులో 30 వేల మంది ఆన్ లైన్ లో ఇతర సంస్ధలకు తమ రెజ్యూమ్ లను పంపుకున్నట్టు సమాచారం. సత్యం జీతాల నెలసరి ఖర్చు దాదాపు 500 కోట్ల రూపాయలు.












Click it and Unblock the Notifications