జైలుకు సత్యం బ్రదర్స్

మరో వైపు.. సీఐడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సత్యం కార్యాలయంలోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) వడ్లమాని శ్రీనివాస్‌ను అరెస్టుచేసింది. పత్రాల పరిశీలన అనంతరం అక్రమాల్లో పాలుపంచుకున్న డైరెక్టర్లను కూడా అరెస్టుచేసేందుకు రంగం సిద్ధంచేసింది. ఇంకోవైపు.. ఖాతాల అవకతవకలకు సంబంధించి సత్యం సంస్థ ఆడిటింగ్ వ్యవహారాలు చూస్తున్న ప్రైస్ వాటర్‌హైస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)కి భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసీఏఐ) షోకాజ్ నోటీసు జారీచేసింది. మూడు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications