మడమ తిప్పలేదు:వై.ఎస్.
నారాయణఖేడ్: తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఏనాడు విస్మరించలేదని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఇస్తామన్న మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆ మాటను నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు.తాము అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలో ఏనాడూ ఇచ్చిన హామీ మరువలేదని స్పష్టం చేసారు. ప్రజా సంక్షేమం కోసం మడం తిప్పలేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో కరవు వచ్చి రైతన్న అప్పుల వూబిలో కూరుకుపోయి ఉంటే తాము అధికారంలోకి వచ్చాకే రైతులకు ఊరట లభించిందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications