మీడియాకు పవన్ క్షమాపణ

పవన్ రావడానికి ముందు వివేకానంద విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున మీడియా, ప్రరాపా నేతలు చేరుకున్నారు. పార్టీ నేత ఫిరోజ్ తన వెంట కొందరు అంగరక్షకులతో వచ్చారు. కార్యకర్తల్ని, అభిమానుల్ని రోడ్డు పైకి తోస్తూ దురుసుగా వ్యవహరించారు. విలేకరులనూ దుర్భాషలాడారు. దీంతో మీడియా విగ్రహం వద్ద బైఠాయించింది. పవన్ వచ్చాక విషయం తెలిసి క్షమించాలని కోరారు. ''మీరు చేయని తప్పునకు సారీ చెప్పడం ఎందుకు? మీ చేత అలా చెప్పించుకోవాలన్నది మా ఉద్దేశం కాదు'' అని కొందరు మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఫిరోజ్ చేత అందరికీ క్షమాపణలు చెప్పించారు.












Click it and Unblock the Notifications