లక్నో: బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ పార్టీ పదవికి ఈరోజు రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటం వల్లే తానీ నిర్ణయం తీసుకున్నట్లు కల్యాణ్‌సింగ్ తెలిపారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు, సీనియర్ నేత అద్వానీకి పంపించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరననీ, క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ఈటా నియోజకవర్గం నుంచి పోటీ చేయమని పార్టీ కోరినా కల్యాణ్‌సింగ్ అందుకు తిరస్కరించారు.