ఒబామా ప్రమాణ స్వీకారం నేడే

ఇక ప్రమాణ స్వీకారం ముగియగానే...'టీమ్ ఒబామా' నేరుగా వైట్‌హౌస్‌కు చేరుకుంటుంది. పదవీ బాధ్యతలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ఒబామా పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచే కొత్త అధ్యక్షుడు పని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన మిలిటరీ కమాండర్లతో సమావేశమై అఫ్ఘాన్, ఇరాక్‌ల గురించి చర్చిస్తారు.ఈ సమయంలో మానవ హక్కులకై పోరాడి గెలిచిన మార్టిన్ లూథర్ కింగ్ కు ఒబామా నివాళులు అర్పించనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా... పరేడ్, నృత్యాలు, ప్రార్థనలు, ఇతరత్రా వేడుకలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications