ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఈరోజు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పెదబయలు మండలం అంబేరుపాడు-విజువాడ మధ్య ఈ ఎదురుకాల్పులు కొనసాగాయి. కొన్ని గంటలపాటు ఈ పోరు సాగింది. అనంతరం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు అందులో ఒకరు మహిళ అని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో మూడు కిట్‌బ్యాగులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications