నేడు కర్నూలు జిల్లాలో వైఎస్ పర్యటన

ఎన్నో ఏళ్లుగా డోన్ పట్టణ ప్రజలు ఫ్లోరైడ్ నీటి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటికి స్వచ్ఛమైన తాగునీటి ప్రాజెక్ట్‌కు మోక్షం లభించింది. కోట్ల దంపతుల కృషితో వాటర్‌ప్రాజెక్ట్ కోసం రూ.53కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటితో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పట్టణ సమీపంలో రూ.3.10కోట్లతో నిర్మించిన బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. 20 ఎకరాల విస్తీర్ణం పైగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలను నిర్మించారు. ఆ పాఠశాలను నేడు సీఎం ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదే విధంగా .రెండున్నర కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఐటిఐలో అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు.
రూ.55లక్షలతో మండలపరిషత్ నూతన భవనానికి, ఆర్థిక మంత్రి రోశయ్య, ఎంపీ కోట్ల కాలనీలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పేదలకు 3వేల పట్టాలకుపైగానే సీఎం చేతుల మీదుగా అందజేస్తున్నారు.30వేల మందికిపైగానే సభకు తరలించాలని కోట్ల దంపతులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం సభ జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా కోట్లదంపతులు తీసుకొని తమ పట్టు మరోసారి నిరూపించుకొనేందుకు సర్వత్రా శక్తులు ఒడ్డుతున్నారు. అదే విధంగా డోన్ నియోజకవర్గ ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాట్ల పనులు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications