26న అన్నవరం ఆలయం మూసివేత
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 8.30-5.45 గంటల వరకు ఆలయంలో కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నారు. ఉదయం ఎనిమిదిన్నర వరకు వ్రతాలు, దైవ దర్శనం ఉంటాయని తర్వాత అన్నదానం ఉచిత ప్రసాదాలతో సహా అన్నింటిని నిలిపి వేసి ఆలయాన్ని మూసివేస్తామని దేవస్థానం ఈవో, దేవాదాయశాఖ ఆర్‌జేసీ ఎస్.కొండలరావు తెలిపారు. సాయంత్రం మహాసంప్రోక్షణ తదితర కార్యక్రమాల తర్వాత దర్శనాలకు అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని ఆ రోజు మూసి వేయనున్నట్టు ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications