సీమ టీడీపీ నేతలతో బాలయ్య భేటీ

ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బాలకృష్ణ పర్యటనపైనే ప్రధానంగా చర్చించారు. ఈ నెల 24వ తేదీన అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరగనున్న పరిటాల రవి వర్ధంతి సభకు బాలయ్య హాజరు కాలేకపోతున్నందున.. రోడ్‌షో సందర్భంగా ఆ గ్రామాన్ని సందర్శించాలని బాలకృష్ట నిర్ణయించుకున్నారు.
29న అనంతపురం జిల్లా హిందూపురంలో బహిరంగ సభతో బాలయ్య రోడ్‌షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పరిటాల నియోజకవర్గమైన పెనుగొండలోకి ప్రవేశిస్తుంది. పరిటాల స్వగ్రామంలో జరిగే సభలో బాలయ్య ప్రసంగిస్తారు. మరోవైపు బాలయ్య పర్యటనలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని బుధవారం నాటి భేటీ తర్వాత పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications