రాజశేఖరరెడ్డే పెద్ద దొంగ: పవన్

Pawan Kalyan
కరీంనగర్: రాష్ట్రంలో అతి పెద్ద దొంగ వైఎస్ రాజశేఖరరెడ్డి అని హీరో, యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయం అమలు జరుగుతోందని ఆయన అన్నారు. ఈవ్ టీజింగ్ మానుకోవాలని పవన్ కల్యాణ్ యువకులను కోరారు. కాంగ్రెస్ నాయకుల దాడులకు భయపడబోనని ఆయన చెప్పారు.

అన్యాయాలను ఎదిరించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అలా ఎదిరించకపోతే రాజకీయాల్లోకి రావడం అనవసరమని పవన్ అన్నారు. వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సత్యం రామలింగరాజు కంటే రాజశేఖరరెడ్డే పెద్ద దొంగ అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న పవన్ నేడు కరీంనగర్ పట్టణంలో యువజన సభలో ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+