అవినీతి తిమింగలం రిమాండ్ పొడిగింపు
విజయవాడ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)వలలో చిక్కుకుని 6 వారాలుగా జ్యుడీషియల్ కస్టడీలో విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈరోజుతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు ముగియటంతో ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపుతో తిరిగి ఆయనను జైలుకు తరలించారు.
నెలకు పాతిక వేల జీతం కూడా రాని సూర్యనారాయణకు 120 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. బినామీ పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో సివిల్ వర్క్ కాంట్రాక్టుల బ్యాంకు ఖాతాలు తెరచి సూర్యనారాయణ తెలివిగా డబ్బు సంపాదించాడు. సీనియర్ ఐఎఎస్ అధికారులను డబ్బుతో, మగువల వలతో ఆయన లొంగదీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సత్యం రామలింగరాజు కేసువెలుగులోకి రావడంతో సూర్యనారాయణకు సంబంధించిన ఫాలో అప్ స్టోరీలు మీడియాలో రాలేదు.












Click it and Unblock the Notifications