అక్రమ సంబంధం: చిన్నారుల హత్య
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన సైదులు, అంజమ్మల సంతానం శ్వేత(9), శివ(5) నిన్న సాయంత్రం పాఠశాలనుంచి వస్తూ అదృశ్యమయ్యారు. అజయ్ అనే వ్యక్తిని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో అతను తానే వారిని అపహరించి హతమార్చినట్లు అంగీకరించాడు. అంజమ్మతో తనకు అక్రమ సంబంధం ఉందని ఆ విషయాన్ని పిల్లలు గమనించటంతో భయపడి నిన్న సాయంత్రం వారు పాఠశాలనుంచి వస్తుండగా అపహరించి పొనుగోడు రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి హతమార్చినట్లు అంగీకరించాడు.












Click it and Unblock the Notifications