గుడివాడలో కొడాలి నాని వీరంగం
గుడివాడ: తెలుగుదేశం ఎమ్మెల్యే కొడాలి నాని, కాంగ్రెస్ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ కార్యకర్త రత్నాకరరావును తీవ్రంగా దూషించి కాలితో నాని తన్నారంటూ ఆయనపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీస్ కేసు నమోదు అయిన సంగతి విదితమే. నానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్సీ,ఎస్టీలు ఈరోజు గుడివాడ బంద్ నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు. వీరికి పోటీగా నానీకి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా గుడివాడ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ర్యాలీ జరిపి నెహ్రూచౌక్ వద్ద రాస్తారోకో చేశారు. కొడాలి నాని నిర్మాత కూడా. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు మేరకే ఆయనకు తెలుగుదేశం టికెట్ లభించింది. స్వల్ప మెజారిటీతో ఆయన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications