తొలి హైటెక్ ప్రెసిడెంట్ ఒబామా!

భద్రతా కారణాల వల్ల బ్లాక్ బెర్రీను అధ్యక్షుడు ఉపయోగించకూడదు. కానీ ఆ పరికరంలో మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేసి, ఆయనకు ఆ సౌకర్యం కల్పించనున్నారు భద్రతా సిబ్బంది.
బ్లాక్ బెర్రీ ఫోన్‌ను ఎక్కువగా వినియోగించే అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మెయిల్స్ కూడా అందులోనే చూసుకుంటారు. అయితే భద్రతాకారణాల దృష్ట్యా వైట్‌హౌస్‌లో ఇంతవరకు ఏ అధ్యక్షుడు మెయిల్ అడ్రస్‌ను కొనసాగించటంలేదు. ఒబామా మాత్రం అధికారులకు అభ్యంతరం లేకపోతే తాను కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. తన సన్నిహితులు, రాజకీయ సహచరులు ఇతరులు ఎవరైనా తనను నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుందని దీన్ని తాను ఆపాలని అనుకోవటం లేదని అనటంతో అధికారులు అందుకు అనుమతించారు.
దీంతో ఈమెయిల్ కొనసాగించే మొదటి అధ్యక్షుడు ఒబామానే కానున్నారు. అమెరికా అధ్యక్షుడి మెయిల్స్ లో రహస్యాలు ఉండడానికి వీల్లేదు. అధ్యక్షుడు వైదొలగిన తర్వాత ఆయన మెయిల్స్ ను బహిరంగ పరచడం ఆనవాయితీ. బిల్ క్లింటన్ గానీ జార్జి బుష్ గానీ వైట్ హౌస్ లో మెయిల్ ఉపయోగించలేదు.












Click it and Unblock the Notifications