ఇకపై మంచి జీవితం: సూరి
హైదరాబాద్: తాను మంచి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానని జైలు శిక్ష అనుభవిస్తున్న మద్దెల చెరువు సూరి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇవరై మూడు రోజుల క్రితం నిమ్స్ లో చేరిన సూరి శుక్రవరం డిశ్ఛార్జి అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరిలాగే మంచిగా జీవించాలని కోరుకుంటున్నానని,తాను ఫ్యాక్షనిస్టును కాదని స్పష్టం చేసారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ తాను ఎలాంటి సెటిల్ మెంట్ చేయలేదన్నారు. పరిటాల రవి హత్య కేసులో నిందుతుడైన సూరి ఆరోగ్యం దెబ్బతినడంతో మెరుగైన వైద్య పరీక్షలు కోసం నిమ్స్ తరలించటం తెలిసిందే.












Click it and Unblock the Notifications