పవన్, రేణూల పెళ్ళి జరిగింది!

నందినికి విడాకులు ఇవ్వడమే కాకుండా, భరణం కూడా చెల్లించిన పవన్ రేణూతోనే ఉంటున్నారు. ఇటీవల ప్రజారాజ్యం యువజన విభాగం అధిపతిగా ప్రజల్లో తిరుగుతున్న పవన్ వైవాహిక జీవితంపై ప్రత్యర్ధి పార్టీల మహిళా నాయకులు విరుచుకు పడుతున్నారు. దీనితో కలత చెందిన పవన్ రేణూతో వివాహాన్ని అధికారికంగా జరిపించుకోవాలని నిర్ణయించారు. జూబిలీహిల్స్ నందగిరి హిల్స్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో ఆర్యసమాజ్ పద్ధతిలో ఈ వివాహం నిరాడంరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పవన్, రేణూల పెళ్ళి శుభలేఖ వారి కుమారుడు అకిరా పేరుతో ముద్రితం కావడం విశేషం.












Click it and Unblock the Notifications