పవన్ కల్యాణ్ ఎవరు? కేసీఆర్

పవన్ లాంటి వారి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని,. ఏమైనా అంటే నవ్వి వదిలేస్తామని ఆయన కొట్టి పారేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి.హరీశ్‌రావుకు మావోయిస్టుల నుంచి అందినట్టు చెబుతున్న లేఖపై అడిగిన ప్రశ్నకు అది ఉత్త బోగస్ అని వ్యాఖ్యానించారు. అసలు తమకు అలాంటి లేఖే రాలేదని చెప్పారు. ఉత్తరం వెనుక ఎవరున్నారన్న అంశాన్ని కూడా తాము ఆలోచించడం లేదన్నారు. మరి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.. తాము ఇంకా దీనిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెదేపాతో పొత్తుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన కొనసాగుతోందని వివరించారు.












Click it and Unblock the Notifications