వ్యభిచారం: సినీ నటి సీమా అరెస్ట్

ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి(55), ఆమె భర్త కృష్ణారావులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. మొదట్లో కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సమీపంలో ఉండేవారు. వారి కూతురు జయలక్ష్మిరావు ఎలియాస్ సీమా(26) సకుటుంబ సపరివార సమేతంగా, అమ్మోబొమ్మ, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా, తపన, కుంకుమ, ఆయుధం, అ«ధిపతి, మధుమాసం తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పోషించింది.
తల్లిదండ్రులతోనే ఉంటున్న సీమా ఇటీవలే తార్నాకలోని నాగార్జున నగర్ కాలనీ 14వ నెంబరు వీధిలోని శుభనివాస్ అపార్ట్‌మెంట్‌లోని 404 ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. ముంబై నుంచి సెక్స్ వర్కర్లను రప్పించి అపార్టుమెంటులో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తోంది. హైటెక్ పద్ధతుల్లో ప్రతి రోజూ విటులనుంచి సీమ, ఆమె తల్లి ఆదిలక్ష్మి వేల రూపాయలు వసూలు చేసేవారు.
ముంబై నుంచి వచ్చే సెక్స్ వర్కర్లకు ఒక్కొక్కరికి వారానికి రూ.30వేలు చెల్లించే విధంగా మధ్యవర్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పకడ్బందీ వ్యూహంతో దాడి చేశారు. సీమా, ఆదిలక్ష్మితో పాటు ముంబైకి చెందిన ఇద్దరు సెక్స్‌వర్కర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5వేల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications