సత్యం బాటలో మిత్సుబిషి
కరసస్: అగ్రగామి ఆటో మొబైల్ సంస్థ మిత్సుబిషి భవితవ్యం ఆందోళనలో పడింది. డిమాండ్ల సాధనకై ఉద్యమిస్తున్న ఉద్యోగులపై పోలీసులు కాల్పులు జరపడంతో వెనిజులాలోని మిత్సుబిషి సంస్థ ప్రధాన కార్యలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందడంతో మిత్సుబిషి భగ్గుమంటున్నది.
మిత్సుబిషికి చెందిన 5,000 మంది ఉద్యోగులతో పాటు మరో 1,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా డిమాండ్ల సాధనకై ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వీరిని కట్టడి చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీనితో ఉద్యోగులు నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.












Click it and Unblock the Notifications