రికార్డు స్ధాయికి బంగారం ధర
ముంబై: బంగారం ధర మరింత పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం నాటికి పది గ్రాముల బంగారం ధర రూ. 14,175 స్థాయికి పెరిగింది. డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి పడిపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధర పెరగడం సామాన్యుడికి శరాఘాతంగా మారింది.
భారత్‌లో తగిన ఉత్పత్తి లేకపోవడం, ఆయా దేశాల బంగారం ఎగుమతులపై భారీగా పన్ను వడ్డింపుల చర్యలు బంగారం రేటు భగభగ లాడడానికి కారణంగా కనిపిస్తున్నది. ఈ ప్రభావంతో సీజన్‌లో అంచనాకు తగ్గట్టు వ్యాపారం జరిగే అవకాశం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications