హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మహాకూటమి ఖచ్చితంగా 200 స్థానాలుగెలిచి తీరుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కొద్ది రోజులుగా తెదేపా తెరాసల మధ్య జరగుతున్న పొత్తుల చర్చల ఓ కొలిక్కి వచ్చాయి. తాను మహాకూటమిలో చేరుతున్నానని కేసీఆర్ ప్రకటించారు. చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు ఈ రోజు కేసీఆర్, హరీష్‌రావు, జయశంకర్, తదితరులు నాయకులు ఆయన ఇంటికి వెళ్లారు. త్వరలో జరగబోయే మహప్రస్థానం సభలో పొత్తులపై వివరాలు వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.