రాజీనామా చేయను: ఎలక్షన్ కమిషనర్

Navin chawla
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల కమిషనర్‌ పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని నవీన్‌ చావ్లా తేల్చి చెప్పారు. పక్షపాత వైఖరితో ఉన్న నవీన్‌ చావ్లాను తప్పించాలని సిఈసి గోపాలస్వామి రాష్ట్రపతికి లేఖ రాయడం తెలసిందే. దీనిపై నవీన్‌ చావ్లా స్పందిస్తూ తాను రాజీనామా చేసేదే లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తమ దృష్టి సాధారణ ఎన్నికల పైనే ఉందంటూ గోపాలస్వామి లేఖ గురించి పట్టించు కోవలసిన అవసరమే లేదని ఉద్ఘాటించారు. బిజెపి చేస్తున్న విమర్శలపైనా ఆయన అదే విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే, నవీన్‌ చావ్లాను ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తప్పించవలసిందేనని బిజెపి సహా ఎన్‌డిఎ పక్షాలు మాటల తీవ్రతను పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+