కెసిఆర్ పై గద్దర్ గరం
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ప్రజా గాయకుడు గద్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవులు, రచయితలు, కళాకారులు వ్యతిరేకించినా కెసిఆర్ చంద్రబాబుతో పొత్తుకు సిద్ధపడ్డారని ఆయన ఆదివారం విమర్శించారు. కెసిఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ముందు ధూంధూం నిర్వహిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎంత శత్రువో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంతే శత్రువు అని ఆయన అన్నారు. ఎన్నికల కోసమే మహా కూటమి ఏర్పడిందని ఆయన అన్నారు. ఎన్నికల పొత్తులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధన సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications