ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య పూచీ

సామాజిక న్యాయాన్ని తెలుగుదేశం పార్టీయే అమలు చేసిందని ఆయన చెప్పారు. తమ పార్టీతోనే సామాజిక న్యాయ కల్పన ప్రారంభమైందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెసుతోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తానని ఆయన అంతకు ముందు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ క్రమశిక్షణ తనకు ఉందని ఆయన చెప్పారు. తాను సినిమాల్లో పోషించాల్సిన పాత్రలు ఇంకా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం వల్ల తెలుగుదేశం పార్టీకి కోస్తాలో నష్టం జరుగుతుందనే వాదనను ఆయన వ్యతిరేకించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉండదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొంతులు కోసే రకమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన యాత్ర సోమవారం డోన్ నుంచి ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications