హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాన రంగాల అభివృద్ధి: గవర్నర్

By Staff
|
Google Oneindia TeluguNews

ND Tiwari
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన రంగాల్లో అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ చెప్పారు. రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంతో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం వార్షిక వ్యవసాయం ఆర్థిక వృద్ధి రేటు 7.13 శాతం ఉందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆయన చెప్పారు. జయయజ్ఞం ద్వారా నాలుగేళ్లలో 12 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని, మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం 12 మంచినీటి సరఫరా ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. 2008 డిసెంబర్ 31వ తేదీ వరకు సాగునీటి ప్రాజెక్టులకు 53 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.

నాలుగేళ్ల కింద గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ ప్రభుత్వం అమలు చేసిందని ఆయన చెప్పారు. ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని లక్ష రూపాయలకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. 2008 డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యవసాయానికి అందించిన రుణ సాయం 43 కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం 75వేల ఎకరాల భూమిని మాత్రమే సేకరించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా గ్రామం యూనిట్ గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి గోదావరి బేసిన్ నుంచి రిలయ్న్ గ్యాస్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.

సమాజంలో ప్రతి బడుగు జీవి సామాజికంగా సరైన జీవనం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, గాంధీ ఆశయాల పరిపూర్తికి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోందని ఆయన చెప్పారు. నాలుగేళ్లలో లక్షా 53 వేల ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు గోదావరి జలాలు అందిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X