మీసం మేలేసి తొడ కొట్టిన బాలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు, తీవ్రవాద దాడులతో సామాన్యుడికి భద్రత కరువైందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ తీవ్రవాద దాడులు జరిగిన దానికి మూలాలు హైదరాబాద్‌లోనే లభిస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ మత ఘర్షణలు జరగలేవని ఆయన గుర్తుచేశారు. రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్న వైయస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు కల్పించలేకపోతుందని, ఆత్మహత్యలను ఎందుకు నివారించలేకపోతుందని ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమానికి కృషిచేసింది తెదేపా ప్రభుత్వమేనని అన్నారు.












Click it and Unblock the Notifications