కాంగ్రెసును చంపండి: బాలయ్య

Balakrishna
కర్నూలు: ఓటు అనే ఆయుధంతో కాంగ్రెసును చంపాలని సినీ నటుడు బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఆయన కర్నూలు జిల్లాలో రోడ్ షోలు నిర్వహించారు. రాయలసీమ పౌరుషాల పురటిగడ్డ అని, తెలుగుబిడ్డగా జన్మించి జాతి పౌరుషాన్ని దశదిశలా చాటిన ఆదర్శమూర్తి తమ తండ్రి గారు ఎన్టీఆర్‌ మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, తన బావగారు చంద్రబాబు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెబుతూ ఏనాడైనా మేం సచివాలయంలో కనిపించామా? ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌ అధికారులను బెదిరించామా? పాలనలో జోక్యం చేసుకున్నామా? లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి మొదలుకొని నేతలందరూ-వారి బంధువులు, కుమారులు, బావమరుదులు ఒకరేమిటి అందరూ-అన్ని చోట్లా పెత్తనం చెలాయిస్తున్నారు. బంధుప్రీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అవినీతి ప్రవాహమై పారుతోంది. ఇలాంటి పార్టీని ఉంచాలా? చంపాలి? ఓటు అనే మీ ఆయుధంతో మీరు ఆపని చేయాలి! వచ్చేది.. కురుపాండవ సంగ్రామం. రామరాజ్యం కావాలో-రాక్షసరాజ్యం కావాలో, మీరే తేల్చుకోండి' అంటూ బాలకృష్ణ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన డోన్‌, బేతంచెర్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోల్లో ప్రసంగించారు.'మీరెంతో అభిమానించే ఎన్టీఆర్‌ కుమారుడిగా ఈ సీమకొచ్చా, మీవూరికొచ్చా, మళ్లీ వస్తానని అన్నారు. ఆడపడుచులపై అరాచకాలు ఎక్కువయ్యాయంటూ..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+