వైయస్ సాధుజంతువయ్యారు: గాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకస్మాత్తుగా సాధుజంతువుగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. తనకు తొడగొట్టడం, మీసం మెలేయటం రాదంటూ ప్రజల్ని మోసం చేసే యత్నం చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. పార్టీలో, బయట తనకు నచ్చని వారిపై వైయస్ రాజశేఖర రెడ్డి మీసాలు తిప్పనిరోజంటూ లేదన్నారు. వైఎస్ గత ఫ్యాక్షన్, హత్యల చరిత్ర రాష్ట్ర ప్రజలు మరచిపోయి ఉంటారని భావిస్తున్నారని ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. వైయస్ చరిత్రను ప్రజలు మరిచిపోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications