సత్యం ఆడిటర్లు పోలీసుల చేతికి...
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌లో ఆడిటర్లుగా పని చేసిన గోపాలకృష్ణన్, శ్రీనివాస్‌లను విచారించడానికి నాంపల్లి కోర్టు సీఐడీ పోలీసులకు అనుమతినిచ్చింది. రేపు ఉదయం పది గంటల నుంచి ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వీరిని సీఐడీ పోలీసులకు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది.
వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందిజ పీడబ్ల్యూసీకి చెందిన ఈ ఇద్దరు ఆడిటర్లు సంస్థలోని అవకతవకలను బయటపెట్టకుండా గోప్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇటీవలే పీడబ్ల్యూసీ వారిని బహిష్కరించింది. మరోవైపు రామలింగరాజు కుటుంబసభ్యులకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ అడ్వైజరీ సంస్థ జీఎం గోపాలకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును న్యాయమూర్తి ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications