హైదరాబాదు షాపులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాదులోని కోఠిలో గల పుష్పాంజలి కాంప్లెక్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంత మంతా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. గతంలో ఇక్కడే ఓ సారి అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే రంగలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఉదయం పూట కోఠీ ప్రాంతంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదం సంభవించిన సమయంలో దుకాణం మూసి ఉంది. షట్టర్లను తీయడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో మంటలను ఆర్పడం తొలుత కష్టంగా మారింది.












Click it and Unblock the Notifications