మహిళా నేత శోభారాణి అరెస్టు
హైదారాబాద్: శాసనసభ ఆందోళనకు దిగిన ప్రజారాజ్యం అనుబంధ సంస్థ మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణిని పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభలో మహిళా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రజారాజ్యం పార్టీ మహిళలు అసెంబ్లీ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మహిళలకు సమస్యలను తెచ్చిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుకోవడం ఖాయమని మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications