అసెంబ్లీ భవంతిపై ఎమ్మార్పీయస్ కార్యకర్తలు

హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీయస్‌ కార్యకర్తలు అసెంబ్లీ భవనంపైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో శాసనసభ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే వారిని బలవంతంగా కిందికి దించారు. కొందరు మంత్రుల గదులలో వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, జానారెడ్డి గదుల్లోకి వెళ్లి వారు తలుపులు వేసుకున్నారు. మంత్రుల గదుల తలుపులను బద్దలు కొట్టి పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. సుమారు 25మంది ఎమార్పీయస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎమ్మార్పీయస్ కార్యకర్తలు శాసనభను ముట్టడించడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. ఎమ్మార్పీయస్ కార్యకర్తలు లోనికి రావడానికి కారకులెవరు, వారు ఎలా వచ్చారనే దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ప్రసాదరావు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టేలా ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని ఎమ్మార్పీయస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద ఎమ్మార్పీయస్ కార్యకర్తలు బైఠాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+