గ్రామసేవకుల సమస్య: విపక్షాల వాకౌట్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తుంగలో తొక్కిందని తెదేపా అధినేత, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. గ్రామ సేవకుల సమస్యలను రాష్ట్ర సర్కారు పూర్తిగా విస్మరించిందని, వారికి కనీస వేతనం లేక నానా అవస్థలు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి హామీ ఇవ్వాలని విపక్షాలు స్పీకర్ పోడియంను ముట్టడించాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, టీఅర్ ఎస్ సభ నుంచి వాకౌట్ చేశాయి.












Click it and Unblock the Notifications