న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. ఛాతీ సంబంధమైన వ్యాధితో సోమవారం రాత్రి 84 ఏళ్ల వాజ్ పేయి ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయనను ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. వాజ్ పేయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.