హైదరాబాద్: బాలికలను చిత్రహింసలకు గురి చేశారనే అభియోగంపై సినీనటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవితపై హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ పోలీసు స్టేషన్‌లో కేసునమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మండాపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి సహకారంతో ఇద్దరు బాలికలు కవిత ఇంట్లో 5నెలల క్రితం పనిలో చేరారు. గత కొన్ని రోజులుగా కవిత, ఆమె చిన్న కూతురు తమను వేధింపులకు గురిచేస్తున్నారని బుధవారం సాయంత్రం కవిత ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఆబాలికలను తీసుకొని ఎస్.ఆర్.నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కవితపై ఫిర్యాదు చేశారు. దీంతో కవితపై పోలీసులు ఎస్.సి, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.