గ్రామసేవకులతో ధర్మాన చర్చలు
హైదరాబాద్: గ్రామ సేవకులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె గురువారం ఆరవ రోజుకు చేరింది. గురువారం అసెంబ్లీ ఆవరణలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గ్రామ సేవకుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. గ్రామసేవకుల డిమాండ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని, త్వరలో గ్రామసేవకుల నేతలను చర్చలకు ఆహ్వానిస్తామని, వారి సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయపార్టీలు గ్రామసేవకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ధర్మాన అన్నారు.












Click it and Unblock the Notifications