రోడ్డు ప్రమాదంలో 4గురు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు. కూడూరు మండలం జల్లిపల్లి వద్ద టాటా సుమో-లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications