మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీఅధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆశయాలకనుగుణంగా పాలన ఉంటుందని బాలకృష్ణ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన బాలకృష్ణ రోడ్‌షో బుధవారం ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర కరువుతో ఇబ్బందులు ఎదురవడంతో అప్పట్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కొనసాగించలేకపోయామని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీని వదిలిన వారికి ప్రజలే బుద్దిచెబుతారని బాలకృష్ణ అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదం కొందరి నాయకుల సృష్టి అని, ప్రజల్లో ఆ భావన లేదని స్పష్టం చేశారు.