ఎర్నేని సీతాదేవి ఇంట్లో చోరీ
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న మాజీ మంత్రి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరికి అయ్యాయి. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మౌంట్ వ్యూ అపార్ట్‌మెంట్ జి-8లో నివసించే మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి తన ఇంట్లో ఏసి రిపేరు, కార్పెంటర్ పనుల కోసం ఇరువురు యువకులను పిలిపించారు.
ఆమె భోజనానికి వెళ్లిన సమయంలో డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉన్న రెండు బంగారు గాజులు, బాలాజీ లాకెట్ ఉన్న నల్లపూసల గొలుసు, డైమండ్ రింగ్ ఒకటి చోరికి గురయ్యాయి. విషయం గమనించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చోరికి గురైన బంగారు వస్తువులు సుమారు 50 గ్రా ములు ఉంటాయని వారు తెలిపారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications