బెంగళూరు: దిగజారిన నైతిక విలువలు, అవినీతిమయమైన రాజకీయ రంగంలో మార్పులు తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన లోక్‌సత్తా పార్టీ శాఖ కర్ణాటకలో ప్రారంభమైంది. గురువారం ఇక్కడ ఆ శాఖను లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం పార్టీ శాఖను ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఒంటరిగా ఐదారు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. స్వచ్ఛమైన రాజకీయాలు, సిద్ధాంతాల ఆధారంగా ఆంధ్రలో పార్టీని నెలకొల్పామని చెప్పారు.