జకీర్ హుస్సేన్ కు గ్రామీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ కు గ్రామీ అవార్డు లభించింది. గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టు ఆల్బమ్ కు గాను వర్తమాన ప్రపంచ సంగీత ఆల్బమ్ కెటగిరీలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ ఆల్బం కోసం హుస్సేన్ సికిరు అడెపోజు, పుయెర్టో రికాన్ జాజ్, గియోవాన్ని హిడల్గోలతో కలిసి పని చేశారు.
ఉత్తమ సంప్రదాయ ప్రపంచ సంగీతం కెటగిరీలో స్లయిడ్ గిటారిస్టు దేవశీష్ భట్టాచార్య, శాస్త్రీయ గాత్ర సంగీతంలో లక్ష్మీశంకర్ నామినేట్ అయినప్పటికీ అవార్డును సాధించలేకపోయారు.












Click it and Unblock the Notifications