గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిబంధనలను ఉల్లంఘించి ప్రజాఅంకితయాత్ర కొనసాగించారని ఆరోపిస్తూ గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత చిరంజీవి నగరంలోని గుజ్జనగుండ్ల ప్రాంతంలో ప్రసంగించారు. దీనిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చేబ్రోలు మండలం నారాకోడూరులో మంగళవారం ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ఘర్షణపడ్డారు. ఇరుపక్షాలకు సర్దిచెప్పడానికి పోలీసులు పలుసార్లు జోక్యం చేసుకున్నారు. ఒకటిరెండు సార్లు స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేశారు.