బంగారప్ప కాంగ్రెస్ లో చేరిక

అనంతరం బంగారప్ప నేరుగా న్యూఢిల్లీలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ నివాసానికి చేరుకున్నారు. అధికారంగా సమాజ్‌వాదీ తీర్థం పుచ్చుకుని, కర్నాటక పార్టీ శాఖ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బంగారప్ప మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాల తో రాజీ పడలేక ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.
1972లో సోషలిస్టుగా రాజకీయాల్లోకి ప్రవేశించానని, ఇప్పుడు అదే సోషలిస్టు భావాలు ఉన్న సమాజ్‌వాదీతో కలిసి పనిచేయడానికి చేతులు కలిపానని బంగారప్ప చెప్పారు. గత ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి షిమోగా నుంచి పోటీ చేసి గెలిచినా, సిద్ధాంత పరమైన వైరుద్యం కారణంగా గెలిచిన ఆ స్థానానికి రాజీనామా చేసానని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications