ఎర్ర జెండాలతోనే అందలం: చాడ
హైదరాబాద్: ఎర్ర జెండాల వల్లనే కాంగ్రెసు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకట రెడ్డి అన్నారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎర్ర జెండాల మద్దతు లేకుంటే అధికారం కల్ల అని ఆయన అన్నారు. తమపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
శాసనసభ ఎజెండా ఎజెండాపై స్పీకరుకే స్పష్టత లేకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని తాము ఇంతకు ముందే కోరామని, ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ అంశంతో ఆడుకుంటోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications