చిరంజీవికేం తెలుసు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి రాజకీయాలు తెలియవని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అవినీతిలో చంద్రబాబు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో దొందూదొందేనని చిరంజీవి చేసిన వ్యాఖ్యపై ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన గురువారం ఉదయం కొన్ని టీవీ చానెళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవికి రాజకీయాలు తెలియకపోతే ఎవరేం చేయలేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని, రాజశేఖర రెడ్డి సరెండర్ కావాలని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు దేశంలోని ఆర్థిక చట్టాలను అన్నింటినీ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

వైయస్ ది మామూలు అవినీతి కాదని ఆయన అన్నారు. ఇది తప్పకుండా ఎన్నికల ఎజెండా అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ అవినీతితో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఎన్నికల అంశాలు అవుతాయని ఆయన అన్నారు. వైయస్ కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 14 సంస్థలపై విచారణ జరిపించకున్నా తమకు చెందిన హెరిటేజ్ పై విచారణ జరిపిస్తే మంచిదని ఆయన అన్నారు. బుధవారంనాడు తమను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గురువారం ఉదయం హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి శాసనసభ వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+