అసెంబ్లీకి మహా కూటమి పాదయాత్ర
హైదరాబాద్: శాసనసభలో స్పీకర్ సాక్షిగా శాసనసభ్యులపై మార్షల్స్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మహాకూటమి ఆధ్వర్యంలో గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, నేతలు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి అసెంబ్లీ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్దకు చేరుకోగానే కార్యకర్తలు కూడా లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని నిరోధించి అరెస్టులు చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడితో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications