సోమిరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
నెల్లూరు: కడప, అనంతపురం జిల్లాలకు సోమశిల జలాలను తరలించే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేస్తూ గత మూడురోజులుగా మాజీమంత్రి, తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష భగ్నమైంది. పోలీసులు ఆయనను అరెస్టుచేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమశిల జలాల పరిరక్షణకు నెల్లూరులో గాంధీ బొమ్మ ఎదుట ఈనెల 9వ తేదీనుంచి ఆయన నిరాహారదీక్ష ప్రారంభించారు.
మంచినీటి పేరుతో సోమశిల జలాలను పరిశ్రమలకు తరలించటాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ దీక్షకు వామపక్షాలు, బిజెపి కూడా మద్దతు ప్రకటించాయి. గురువారం తెల్లవారుజామున పోలీసులు వచ్చి టీడీపీ నేతలను, కార్యకర్తలను నెట్టివేసి సోమిరెడ్డిని అరెస్టు చేశారు. ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications